ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై అమిత్ షాతో జగన్ చర్చించారు. విభజన హామీలు అమలు చేయాలని కోరారు. హస్తిన పర్యటనలో సీఎం జగన్ రెండోరోజు బిజీబిజీగా గడిపారు. ఉదయం నుంచి పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రాభివృద్ధిపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ను ముఖ్యమంత్రి కోరారు.
వెనుకబడిన జిల్లాలకు నిధులు విడుదల చేయాలని ఆర్థికమంత్రికి విజ్ఞప్తి చేశారు. అలాగేవిభజనతో నష్టపోయిన రాష్ట్రానికి అండగా ఉండాలని కోరారు. అమరావతి-అనంతపూర్ ఎక్స్‌ప్రెస్ హైవేకు కేంద్రం గ్రాంట్లు ఇవ్వాలని గడ్కరీని జగన్ కోరారు. అలాగే కొత్త రహదారుల నిర్మాణానికి చేయూత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జీవన ప్రమాణాల కోసం భారీ కార్యక్రమాలు చేపట్టినట్లు జగన్ వివరించారు.