దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ప్రతి ఒక్కరూ స్వీయ గృహనిర్బంధంలో ఉండాల్సిన పరిస్తితి నెలకొంది. . లాక్ డౌన్ కారణంగా కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ సైతం ఇంటికే పరిమితం అయ్యారు. అయితే, సెలూన్లు మూసివేయడంతో ఆయన తన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ తో హెయిర్ ట్రిమ్మింగ్ చేయించుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
చిరాగ్ పాశ్వాన్ ట్రిమ్మర్ సాయంతో తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ గడ్డాన్ని ఎంతో నేర్పుగా ట్రిమ్ చేయడం ఈ వీడియోలో చూడొచ్చు. తనయుడు ట్రిమ్మింగ్ చేస్తున్నంత సేపు ఓపిగ్గా కూర్చున్న కేంద్రమంత్రివర్యులు ఆపై అద్దంలో తనను తాను చూసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వీడియోను చిరాగ్ పాశ్వాన్ ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ వీడియోను గంటలోపే వెయ్యిమంది లైక్ చేశారు.