telugu navyamedia
వార్తలు సామాజిక

కరోనా చికిత్స కోసం వ్యాక్సిన్ రెడీ…హైద్రాబాద్ సంస్థకు క్లియరెన్స్!

covifor corona injection

కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ తయారీపై దృష్టి పెట్టాలని అనేక ఫార్మా రంగ సంస్థలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాను నిరోధించేందుకు మందును కనిపెట్టినట్టుగా హైద్రాబాద్ హెటిరో ఫార్మాసూటికల్స్ ప్రకటించింది. మరో ఫార్మా సంస్థ సిప్లా కూడా ఈ ఔషధానికి అనుమతులు దక్కించుకుంది. కోవిఫర్ తయారీకి, మార్కెటింగ్ కు డీజీసీఐ సిప్లా, హెటెరో సంస్థలకు క్లియరెన్స్ ఇచ్చింది.

హెటెరో సంస్థ ఇప్పటికే లక్ష డోసులు సిద్ధం చేసింది. ఇంజెక్షన్ రూపంలో ఉన్న ఈ యాంటీ వైరల్ డ్రగ్ నేటి నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానుంది. హెటెరో వర్గాలు దీనిపై మాట్లాడుతూ, కరోనా లక్షణాలన్నింటిపైనా కోవిఫర్ సమర్థవంతంగా, సమగ్రంగా పనిచేస్తుందని తెలిపాయి. కరోనా చికిత్సలో తొలిరోజున ఒక 200 ఎంజీ డోసు ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని, ఆపై ఐదు రోజుల పాటు 100 ఎంజీ డోసు ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించాయి.

Related posts