చంద్రబాబుకు మీరు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటే, హైదరాబాద్ లో ఉన్న ఆయన ఇంటిని సీజ్ చేసుకోవచ్చు. ఓటుకు నోటు కేసును తిరగతోడవచ్చు. అంతే తప్ప అవి పక్కనబెట్టి చంద్రబాబు మీద కోపంతో జగన్ కు మద్దతు ఇస్తే మాత్రం నేను మొన్నటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాడుతాను. ఆంధ్ర ప్రజలు వేరు, పాలకులు వేరని గుర్తుంచుకోండి.. అని బీఎస్పీ – జనసేన బహిరంగ సభలో పవన్ కల్యాణ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సలహా ఇచ్చారు.
తెలంగాణ ఉద్యమం, వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉన్నప్పుడు, పదిమంది కూడా వెనుక లేకుండా ఏం చేస్తారంటూ ప్రశ్నించిన విషయాన్ని మరిచారా? అని ప్రశ్నించిన పవన్.. మానుకోట రైల్వే స్టేషన్ లో జగన్ చేసిన దౌర్జన్యాలు మరిచారా? అంటూ అడిగారు. తిరుమలకు చెప్పులతో వచ్చిన జగన్ వంటి వ్యక్తిని వెనకేసుకుని వచ్చి, ఏపీ ప్రజలకు నష్టం కలిగించవద్దని ఆయన కోరారు.
రాష్ట్రం పచ్చగా ఉంటే ప్రతిపక్ష నేతలు ఓర్వలేకపోతున్నారు: మంత్రి అనిల్