telugu navyamedia
రాజకీయ

రాహుల్ ప్రధాని అయ్యే అవకాశం లేదు: వరుణ్ గాంధీ

Varun Gandhi
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పై తన తమ్ముడు బీజేపీ నేత, పిలిభిత్ బీజేపీ అభ్యర్థి వరుణ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే రెండు దశాబ్దాల్లోనూ ప్రధాని అయ్యే అవకాశం లేదని వరుణ్ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీకి సరితూగే నాయకుడే కాంగ్రెస్ శిబిరంలో లేరని చెప్పుకొచ్చారు. 
అందుకే తాను వచ్చే పది, 20 ఏళ్లలోనూ రాహుల్ ప్రధాని కాలేరని చెబుతున్నట్టు వెల్లడించారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీపై వరుణ్ గాంధీ ప్రశంసలు కురిపించారు .మోడీకి జనం ఓట్లు వేయడంతో పాటు వారి రక్తం కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారని వరుణ్ గాంధీ అన్నారు.

Related posts