telugu navyamedia
రాజకీయ

వారసత్వ రాజకీయాలు సమాజానికి ప్రమాదం

వారసత్వ రాజకీయాలు సమాజానికి ప్రమాదకరమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. 

2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారికి మోడీ నివాళులర్పించారు. 2008లో ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించి వందలాది మంది అమాయక పౌరులను హతమార్చిన ఈరోజు 26/11 కూడా మనకు చాలా బాధాకరమైన రోజు అని ఆయన అన్నారు

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ..రాజ్యాంగాన్ని మన గొప్ప నాయకులు, భారతదేశానికి స్వాతంత్ర్యం పొందిన వారు రచించారు. అయితే ఈరోజు మనం రాజ్యాంగంలోని ఒక పేజీని కూడా అనుసరిస్తున్నామా?. మనం రాజ్యాంగాన్ని అక్షరబద్ధంగా, స్ఫూర్తితో పాటిస్తున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనం ఎటువైపు వెళ్తున్నామో, మన ప్రాధాన్యత ఏమిటి, దేశాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.” అని మోడీ అన్నారు..

ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను మోడీ తప్పుబట్టారు. అధికారాలు కుటుంబాలు గుప్పిట్లో పెట్టుకోకూడదన్నారు.ఒక పార్టీని అనేక తరాలుగా ఒకే కుటుంబం నడుపుతుంటే  ప్రజాస్వామ్యానికి అతిపెద్ద సమస్య అని మోడీ అన్నారు.

Constitution Day: … could we write a single page of the constitution today ?: Prime Minister Narendra Modi | Constitution Day: PM Modi addresses event at Parliament's Central Hall | pipanews.com

“కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాజవంశ రాజకీయ పార్టీలను చూడండి, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఇది రాజ్యాంగంపై నమ్మకం ఉన్నవారికి ఆందోళన కలిగిస్తుంది,” అన్నారాయన. “

“సొంత ప్రజాస్వామ్య స్వభావాన్ని కోల్పోయిన పార్టీలు దేశ ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షించగలవు? వంశపారంపర్య రాజకీయాలు అని నేను చెప్పినప్పుడు, ప్రజలు ఒకే కుటుంబం నుండి రాజకీయాల్లోకి రాలేరని నా ఉద్దేశ్యం కాదు. పార్టీని తరతరాలుగా ఒకే కుటుంబం నడుపుతోంది, అది ప్రజాస్వామ్యానికి సరికాదు అని మోదీ అన్నారు.

రాజ్యాంగమనేది ప్రజల ఆకాంక్షలకు ప్రతీక అని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేర్కొన్నారు. రాజ్యాంగమే అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రత్యేక విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. రాజ్యాంగ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్, టీఎంసీతో సహా 12 పార్టీలు బహిష్కరించాయి.

 

Related posts