telugu navyamedia
ఆంధ్ర వార్తలు

నాకు జరిగిన అవమానం ఎవరికీ జరగకూడదు..

ఆంద్ర‌ప్ర‌దేశ్‌ అసెంబ్లీలో తనపై చేసిన వ్యాఖ్యలకు తెదేపా అధినేత‌ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మొదటిసారిగా స్పందించారు. ఈ వ్యాఖ్యల పై ప్రెస్ నోట్ విడుదల చేసారు .

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో త‌న‌పై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లికి, తోబుట్టువుకు, కూతురికి జరిగినట్టుగా భావించి నాకు అండగా నిలబడటం నా జీవితంలో మర్చిపోలేను అన్నారు. చిన్నతనం నుంచి అమ్మ, నాన్న మమ్మల్ని విలువలతో ఉంటారు. నేటికీ మేము వాటిని పాటిస్తున్నామ‌ని, విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని తెలిపారు.

Chandrababu Naidu's Family Announces Asset Details, Will Jagan Govt Prove Them Wrong?

కష్టాల్లో ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడాలి అని సూచించారు. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదు. నాకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నాను అని అందులో పేర్కొన్నారు నారా భువనేశ్వరి.

Viral Video: Chandrababu Naidu Breaks Down In Press Conference

అసెంబ్లీలో త‌న భార్య నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబుతో అసెంబ్లీ సభను వదిలి బయటకు వచ్చేశారు. సీఎం అయిన తర్వాతే తిరిగి అసెంబ్లీకి వస్తానంటూ.. చంద్రబాబు ఆవేశంతో మాట్లాడారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏ విషయంలో జోక్యం చేసుకోని తన సతీమణిని కూడా రాజకీయాల్లోకి లాగడంపై చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై నారా కుటుంబం సైతం మీడియా సమావేశం నిర్వహించింది. వైసీపీ తీరు మార్చుకోవాలని సూచించింది. సినీ నటుడు బాలకృష్ణ అయితే వైసీపీ నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చారు.

Related posts