telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

కరుణానిధి మనవరాలు అరెస్టుకు .. రంగం సిద్ధం .. !

దివంగత తమిళ రాజకీయ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవరాలు అంజుగ సెల్వి అరెస్టుకు కోర్టు ఆదేశాలిచ్చింది. ఆదాయ పన్ను శాఖకు సకాలంలో రిటర్న్స్‌ దాఖలు చేయకపోవడంతో ఐటీ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కోర్టు కేసును పరిశీలించి నాన్‌ బెయిల్‌బుల్‌ వారెంటు జారీ చేసింది.

అంజుగ సెల్వి(కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి కుమార్తె అయిన) 2009-10 సంవత్సరానికి సంబంధించిన రిటర్స్‌ దాఖలు చేయలేదు. ఆమె దాదాపు 70 లక్షల రూపాయల పన్ను చెల్లించాల్సి ఉండడంతో ఆదాయ పన్ను శాఖ అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. దేనికీ ఆమె స్పందించ లేదు సరికదా డబ్బు కూడా చెల్లించకపోవడంతో ఆదాయ పన్ను శాఖ అధికారులు కేసు పెట్టారు. కేసును విచారించిన కోర్టు అంజుగ సెల్వికి అరెస్టు వారెంటు జారీ చేసింది.

Related posts