telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ ఎన్నికల పై నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

Prakash Raj Contest Bangalore Central

మొన్న ఏపీ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల పై నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు అభివృద్ధికి, ప్రభుత్వ వ్యతిరేకతకు మధ్య జరగలేదన్నారు. వ్యక్తిగత ఆరోపణలు, నేతల మధ్య విభేదాలు ప్రాతిపదికన జరిగాయని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు.తనకు ఏపీ ఎన్నికల్లో పరిస్థితి ఏంటన్న విషయమై క్షేత్రస్థాయిలో అవగాహన లేదన్నారు.

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఓ పండగ వంటివని చెప్పారు. అటువంటి పండగ సమయంలో హత్యలు, గోడవలు ఏంటని ప్రశ్నించారు. ఈవీఎంలను పగులగొట్టిన దృశ్యాలను చూసి బాధపడ్డానని అన్నారు. ప్రజలు పోటీలో ఉన్న అభ్యర్థుల చరిత్ర, స్థానిక సమస్యలను, అవి పరిష్కరించే సత్తా ఉన్న వారికే ఓటు వేసివుంటారని భావిస్తున్నానని అన్నారు.

చంద్రబాబుకు గతంలో వచ్చినంత మెజారిటీ రాకపోవచ్చని చాలామంది అంటున్నారని తెలిపారు. ఇదే సమయంలో జగన్ చాలా ఎదిగారని చెబుతున్నారని అన్నారు. ఓ విజన్ ఉన్న నాయకుడైన చంద్రబాబు, ఈ ఎన్నికల ప్రచారంలో తన విజన్ ను ప్రజల ముందుకు తీసుకు రాలేదని తెలిపారు.. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన సమయంలో చంద్రబాబు ఓ అనుభవం ఉన్న నేతగా ప్రతి ఒక్కరికీ కనిపించారని, నేడు ఆయన కేవలం ఆరోపణలకు పరిమితం అయ్యారని తెలిపారు.

Related posts