telugu navyamedia
రాజకీయ వార్తలు

సీఏఏ నిరసనపై యూపీ అసెంబ్లీలో చర్చ.. సీఎం యోగి ఆగ్రహం!

yogi adityanath

యూపీ అసెంబ్లీలో ప్రతిపక్షాలు సీఏఏ ఆందోళన అంశాన్ని ప్రస్తావించడంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలో చనిపోయిన వారిని ఉద్దేశించి యోగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎవరైనా చనిపోవాలనుకుని వస్తుంటే.. వాళ్లు ఎలా బతికి ఉంటారని పేర్కొన్నారు. యోగి చేసిన ఈ కామెంట్లపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ఆందోళనకారులెవరూ పోలీసుల కాల్పుల్లో చనిపోలేదని, నిరసనల్లో పాల్గొన్నవారు కాల్చడంతోనే చనిపోయారని యోగి వ్యాఖ్యానించారు. ప్రజలను కాల్చాలన్న ఉద్దేశంతో కొందరు వీధుల్లోకి వస్తే.. అయితే వాళ్లు చనిపోతారని, లేకపోతే పోలీసులు చనిపోవాల్సి వస్తుందని అన్నారు. ‘‘శాంతియుతంగా నిరసనలు తెలుపుకొంటే సరే. అలా కాకుండా కొందరు ప్రజాస్వామ్యం ముసుగులో హింసకు పాల్పడితే.. మేం కూడా వారి భాష (హింస)లోనే బదులిస్తాం..” అని హెచ్చరించారు.

Related posts