telugu navyamedia
తెలంగాణ వార్తలు

బీజేపీ విజయ సంకల్ప సభలో తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

*తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
*మీ ప్రేమ అశ్వీర్వాదాల‌కు ధ‌న్య‌వాదాలు

*తెలంగాణ మొత్తం ఈ గ్రౌండ్‌లో కూర్చున్నట్లుంది
*తెలంగాణలో కళలు, నైపుణ్యం ఎంతో మెండుగా ఉన్నాయి

సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్ లో బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. బీజేపీని ఆశీర్వదించేందుకు ఎంతో దూరం నుంచి వచ్చిన సోదరీ సోదరీమణులకు, ప్రతిఒక్కరికీ నా ధన్య వాదాలు అంటూ ప్రధాని ప్రసంగం మొదలుపెట్టారు.

తెలంగాణ మొత్తం ఈ గ్రౌండ్‌లో కూర్చున్నట్లుందన్నారు ప్రతిభకు హైదరాబాద్‌ పట్టం కడుతుందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పని చేస్తుందని మోదీ పేర్కొన్నారు.

మీరు నాపట్ల చూపిన ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు. హైదరాబాద్‌కు ప్రతిభకు పట్టం కడుతుంది. బీజేపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుంది. తెలంగాణ ప్రాచీన, పరాక్రమాల గడ్డ. భద్రాచల రామయ్య ఆశీస్సులు మనకున్నాయి. తెలంగాణ అభివృద్ధే బీజేపీ ధ్యేయం అన్నారు. తెలంగాణలో కళలు, నైపుణ్యం ఎంతో మెండుగా ఉన్నాయన్నారు.

తెలంగాణ ప్రాచీన, పరాక్రమాల గడ్డ. భద్రాచలంలో శ్రీరాముడు, యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి జోగులాంబ అమ్మవారు, వరంగల్‌ భద్రకాళీ అమ్మవారి ఆశీర్వాదాలు ఉన్నాయి. కాకతీయులు వీరత్వం, శిల్పకళా సౌందర్యం ఎంతో గొప్పది. ఇక్కడి సాహిత్యకారుల కృషి దేశానికే గర్వకారణం. తెలంగాణలో కలలు, నైపుణ్యం ఎంతో మెండుగా ఉన్నాయి. తెలంగాణ గడ్డ ఎంతో స్ఫూర్తిని ఇస్తోంది. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోంది. 

Related posts