telugu navyamedia
తెలంగాణ వార్తలు

కొడుకుని సీఎం చేసేందుకు కేసీఆర్ రాజ‌కీయం-అమిత్‌షా

*తెలంగాణ‌లో ఎన్నిక‌లు ఎప్ప‌డు వ‌చ్చినా బీజేపీ ప్ర‌భుత్వ‌మే..
*ఉపాధి అంటే కేసీఆర్ కుటుంబానికి ఉపాధి..
*తెలంగాణ దినోత్స‌వం రోజున కూడా నేను ఇక్క‌డు ఉన్నాను
*కొడుకును సీఎంను చేసేందుకు కేసీఆర్ రాజ‌కీయం చేస్తున్నారు.

రాష్ట్రంలో ఎన్నిక‌లు ఎప్పుడొచ్చినా తెలంగాణలో ఏర్పడబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు కేంద్రమంత్రి అమిత్‌షా. హైదరాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన విజయ సంకల్ప్ సభ వేదికపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

8ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్‌ చేసింది ఏమి లేదన్నారు. ఒక్కసారి బీజేపీకి అధికారం కట్టబెడితే టీఆర్‌ఎస్‌ పార్టీని కూపటి వేళ్లతో పెకిలిస్తామన్నారు.

నీళ్లు, నిధులు, నియామకాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పడిందన్నారు. తెలంగాణ ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలు అందాయా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతి పాలనను అంతమొందిస్తామన్నారు.

రాష్ట్ర ప్రజలకు ఏవైతే టీఆర్ఎస్‌ హామీలు ఇచ్చిందో నీళ్లు, నిధులు, నియామకాలను సంపూర్ణంగా అమలు చేసి ప్రజలకు సంక్షేమ, అవినీతిరహిత పాలన అందిస్తామని విజయసంకల్ప్ సభావేదికగా మాటిచ్చారు అమిత్‌షా.

కేసీఆర్‌కి ప్రజల సమస్యలు పట్టడం లేదని ..ప్రజల అవసరాలు, అవస్థలు పట్టించుకోకుండా కేవలం తన కొడుకుని ఎలా ముఖ్యమంత్రిని చేయాలనే  మాత్రమే రాజకీయాలు చేస్తారని మండిపడ్డారు

తెలంగాణ పోరాటానికి మొదటి నుంచి బీజేపీ మద్దుతుందన్నారు. రాష్ట్ర విభజనను కాంగ్రెస్ అసంపూర్తిగా చేసిందని మండిపడ్డారు. కేసీఆర్ పార్టీ గుర్తు కారు స్టీరింగ్ అసదుద్దీన్ ఒవైసీ చేతుల్లో ఉంద‌న్నారు.

విమోచన దినాన్ని కేసీఆర్ ఎందుకు అధికారికంగా జరపడం లేదని ఆయన ప్రశ్నించారు. ఓవైసీకి భయపడే విమోచనం దినాన్ని కేసీఆర్ జరపడం లేదని అమిత్ షా దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వస్తే.. ఎవరికీ భయపడకుండా విమోచన దినం జరుపుతామని ఆయన స్పష్టం చేశారు.

గతంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు సమస్య రాలేదని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ మూఢనమ్మకాలతో సచివాలయాన్ని కూల్చారని మండిపడ్డారు. సచివాలయానికి కేసీఆర్ రాక ఎన్ని రోజులైంది? అని ప్రశ్నించారు

కేసీఆర్ ఇక సచివాలయానికి వెళ్లక్కర్లేదంటూ అమిత్ షా సెటైర్లు వేశారు. వచ్చేసారి సచివాలయానికి వెళ్లేది బీజేపీ ముఖ్యమంత్రేనని ఆయన జోస్యం చెప్పారు.

 ప‌టేల్ లేకుంటే హైద‌రాబాద్ రాష్ర్టం భాగం అయ్యేది కాద‌ని గుర్తు చేశారు. దేశం పురోగ‌మిస్తుంటే ..తెలంగాణ తిరోగ‌మ‌నంలో ఉంద‌న్నారు.

.

Related posts