telugu navyamedia
తెలంగాణ వార్తలు

డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ తోనే తెలంగాణ అభివృద్ధి..-మోదీ

*డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ తోనే తెలంగాణ అభివృద్ధి..
*తెలంగాణ‌లో డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ ఏర్ప‌డితే మ‌రింత అభివృద్ధి వేగ‌వంతం..
*తెలంగాణలో మెగా టెక్స్‌టైల్ పార్కు నిర్మిస్తాం.
*సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌.. మంత్రంతో తెలంగాణ అభివృద్ధి..
*తెలంగాణ అభివృద్ధే మా పార్టీ ప్రాధాన్యత..
* బీజేపీపై తెలంగాణ ప్రజలకు నమ్మకం పెరుగుతోంది..
*8 ఏళ్లుగా దేశప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రయత్నించాం..

తెలంగాణ‌లో డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ వ‌స్తుంద‌ని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన విజయ సంకల్ప సభ వేదిక‌గా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా మోడీ మాట్లాడుతూ..సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్.. మంత్రంతో తెలంగాణను అభివృద్ధి చేస్తామన్నారు

2019 ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణ ప్రజలు మద్దతు పలికారు. తెలంగాణ ప్రజల్లో బీజేపీపై నమ్మకం పెరుగుతోందని.. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని మోడీ తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగిరిందని ఆయన గుర్తుచేశారు. దళితులు, ఆదివాసీలు,పేదల ఆకాంక్షలను బీజేపీ నెరవేర్చిందన్నారు.

ఎనిమిదేళ్లుగా భారతీయుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఎంతో ప్రయత్నించామని చెప్పారు. అభివృద్ధి నలుమూలలకూ విస్తరించేందుకు శ్రమించామని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకూ భాజపా సర్కార్‌ ఆకాంక్షలు నెరవేరుస్తుందన్న భరోసా వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. భాజపా సర్కార్‌ విధానాల కారణంగా తెలంగాణలోని ప్రతి వర్గ ప్రజలకూ అభివృద్ది ఫలాలు అందుతున్నాయని చెప్పారు. కొవిడ్ మహమ్మారి ఇబ్బంది పెట్టినా తెలంగాణలో ప్రతి కుటుంబానికి మద్దతుగా నిలిచామని స్పష్టం చేశారు. కరోనా సమయంలో కోట్లాది మంది తెలంగాణ ప్రజల కోసం వ్యాక్సిన్‌లు అందించమని, పేద ప్రజలకు ఉచిత రేషన్‌ అందించామని గుర్తు చేశారు.

హైదరాబాద్‌లో సైన్స్‌ సిటీ ఏర్పాటుకు ఎంతో ప్రయత్నిస్తున్నాం. బయోమెడికల్‌ సైన్సెస్‌ కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. తెలుగులో టెక్నాలజీ, మెడికల్‌ చదువులు ఉంటే ఎంత బాగుంటుందో ఆలోచించండి.

రైతుల కోసం ఎంఎస్‌పీని పెంచామని.. హైదరాబాద్ లో 1500 కోట్లతో ఫ్లై ఓవర్లు, ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వేలు నిర్మిస్తున్నామని ప్రధాని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్ కూడా కేటాయించామని మోడీ చెప్పారు.

 

Related posts