కొండా దంపతులు ఇవాళ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశం అనంతరం మాట్లాడుతూ… వైఎస్ షర్మిల పార్టీ నుంచి పిలుపు వచ్చిందన్న కొండా మురళి.. ఎట్టిపరిస్థితుల్లో రాలేమని చెప్పామని స్పష్టం చేశారు.. పార్టీ మారితే వైఎస్ షర్మిల డబ్బు ఇస్తుంది.. కానీ, నాకు విలువలు ముఖ్యం అన్నారు.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా.. కాంగ్రెస్‍లోనే కొనసాగుతానని ప్రకటించారు. ఇక, గతంలో తనకు ఎదురైన అనుభవాలను కూడా గుర్తు చేసుకున్నారు కొండా మురళి.. వైఎస్ జగన్ ను జైలు నుంచి బయటకు తెచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశామన్న ఆయన.. ఆ తర్వాత జగన్ కనీసం పలకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. మరోవైపు, ఏబీసీడీలు రాని మంత్రి ఎర్రబెల్లికి అవార్డులు వస్తున్నాయట అంటూ ఎద్దేవా చేసిన మురళి.. కరోనాతో చావు అంచుల వరకు వెళ్తే టీఆర్‍ఎస్ సంబరాలు చేసుకుందని మండిపడ్డారు.. చంద్రబాబుతోనే ఫైట్ చేశా.. కేసీఆర్ ఎంత అని ప్రశ్నించారు.. కార్పొరేషన్ ఎన్నికల్లో అమ్ముడుపోవద్దు అని తెలిపారు.
previous post