telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

కరోనా పేరుతో ఈమెయిల్స్… కేంద్రం హెచ్చరిక

Hacking

కరోనా పేరుతో వస్తున్న మెయిల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటోంది కేంద్రం. కరోనా పరీక్షలు ఫ్రీగా చేస్తున్నారంటూ ఈ-మెయిల్ వస్తే అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వ అనుబంధ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్) సూచించింది.. ముఖ్యంగా [email protected] పేరుతో ఈ-మెయిల్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయొద్దని హెచ్చరించింది. ఆ మెయిల్ పై క్లిక్ చేస్తే కష్టాలు తప్పవని.. వ్యక్తిగత సమాచారంతో పాటు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రహస్య సమాచారం అంతా హ్యాకర్ల చేతికి చేరుతుందంటున్నారు. ఈ ఈ- మెయిళ్లను తెరిస్తే ప్రమాదంలో పడినట్లేనని.. వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలంటోంది. కొద్దిరోజులుగా ఈ ఫేక్ ఈ-మెయిల్స్ వస్తున్నాయని.. ఈ మెయిల్స్ ద్వారా హ్యాకర్లు వ్యక్తిగత, బ్యాంక్ సంబంధిత వివరాలను కొట్టేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. అసలే కరోనాతో జనాలు భయపడుతుంటే.. ఈ మెయిల్స్‌తో గందరగోళం ఏర్పడింది. సైబర్ కేటుగాళ్లు ఇదే అదనుగా కొత్త, కొత్త మార్గాల్లో రెచ్చిపోతున్నారని.. అపరిచిత మెయిల్స్, మెసేజ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరిస్తోంది.

Related posts