telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

కేసీఆర్‌ బర్త్‌డే..ప్రధాని మోడీ విషెష్..

నేడు తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టిన రోజు. కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్‌ వేదికగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. అంతేకాదు.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సైతం సీఎం కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. అటు సీఎం కేసీఆర్‌కు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌ సహా పలువురు మంత్రులు శుభాకాంక్షలు చెప్పారు. కేసీఆర్‌ సారథ్యంలో దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల నెరవేరిందని, భావితరాల బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

Related posts