telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 కు ఆ రెండు దేశాల ఆటగాళ్లు పూర్తిగా దూరం…

new feature in ipl 2020

కరోనా కారణంగా అర్థాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 మిగతా సీజన్‌కు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఆటగాళ్లు దూరమయ్యే అవకాశం ఉంది. ఐపీఎల్ 2021లో 29 మ్యాచులు ముగిశాక ఈ లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేసింది. అయితే మిగిలిన 31 మ్యాచులు నిర్వహించేందుకు సరైన సమయం కోసం బీసీసీఐ ఎదురుచూస్తోంది. టీ20 ప్రపంచకప్‌ ముందు సెప్టెంబర్‌, అక్టోబర్ మధ్యలో నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. బీసీసీఐ ముందున్న ఖాళీ విండో కూడా అదే. దాంతో ఆ నెలలోనే మళ్లీ ఐపీఎల్ పట్టాలెక్కనుందనే చర్చ ఊపందుకుంది. అయితే సెప్టెంబర్‌లో న్యూజిలాండ్ యూఏఈ వేదికగా పాకిస్థాన్‌తో ఆడనుంది. దాంతో ఐపీఎల్ ఆడుతున్న న్యూజిలాండ్ ఆటగాళ్లు ఐపీఎల్ సెకండాఫ్‌కు దూరం కానున్నారు.

అలాగే ఐపీఎల్ 2021 సీజన్‌ను ఎప్పుడు రీషెడ్యూల్ చేసినా ఇంగ్లండ్ ప్లేయర్లు అందుబాటులో ఉండే అవకాశం లేదని ఈసీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ యాష్లే జైల్స్ తెలిపాడు. ఇంగ్లండ్ టీమ్‌కు ఉన్న బిజీ షెడ్యూలే ఇందుకు కారణమన్నాడు. ‘మా ప్లేయర్లను ఇంగ్లండ్‌కే ఎక్కువ ఆడేలా చూస్తున్నాం. ఎఫ్‌టీపీ ప్రకారం మా షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. పాక్, బంగ్లా టూర్‌లు ఉంటే మా ప్లేయర్లు అక్కడికి వెళతారు. ఐపీఎల్ మళ్లీ ఎప్పుడు ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. కానీ న్యూజిలాండ్ సిరీస్‌తో మొదలయ్యే మా సమ్మర్ సీజన్ చాలా బిజీగా ఉండనుంది. ఇండియాతో టెస్ట్ సిరీస్ తర్వాత హండ్రెడ్ టోర్నీ ఉంటుంది. ఇక టీ20 వరల్డ్‌కప్, యాషెస్ ఉండనే ఉన్నాయి’అని జైల్స్ పేర్కొన్నాడు.

Related posts