telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

స్థానికంగా ఆక్సిజన్ ఉత్పత్తి పెరిగితే ఒత్తిడి తగ్గుతుంది : ఆళ్ళ నాని

మంత్రి ఆళ్ళ నాని మాట్లాడుతూ… మొదటి దశలో వచ్చిన కేసుల కంటే రెట్టింపు సంఖ్య ఇప్పుడు వచ్చింది. మొదటి వేవ్ లో అత్యధికంగా 240 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం పడింది. గతంలో 17 వేల ఆక్సిజన్ బెడ్లు ఉంటే సెకండ్ వేవ్ లో 11 వేల ఆక్సిజన్ బెడ్లు అదనంగా ఏర్పాటు చేశాం. మరో 10 వేల ఆక్సిజన్ బెడ్ల కోసం చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం కేంద్రం ఇస్తున్న ఆక్సిజన్ కోటా 590 మెట్రిక్ టన్నులు. రాష్ట్ర అవసరం 590 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువగా ఉంటోంది. అయితే ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు కేంద్రం ఆక్సిజన్ కేటాయింపులు పెంచుతుందని ఆశిస్తున్నాం. ఆక్సిజన్ స్టోరేజ్ సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. స్థానికంగా ఆక్సిజన్ ఉత్పత్తి పెరిగితే ఒత్తిడి తగ్గుతుంది అని పేర్కొన్నారు. ఆక్సిజన్ వృధా కాకుండా మానిటరింగ్ కమిటీలు కూడా వేశాం అని తెలిపారు. చంద్రబాబు ప్రజలను భయాందోళనలకు గురి చేసే విధంగా మాట్లాడుతున్నారు. వ్యాక్సిన్ విషయంలో వాస్తవాలు తెలిసి కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఇంగిత ఙానం లేకుండా వ్యవహరిస్తున్నారు అని అన్నారు.

Related posts