సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులను పూర్తి స్థాయిలో నడపాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన అధికారులు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ తాత్కాలిక నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో నియమించుకునే వారికి చెల్లించాల్సిన మొత్తాలను కూడా అందులో పేర్కొంది. సెలక్ట్ చేసిన అభ్యర్థులకు రోజువారీగా డ్రైవర్‌కు రూ.1500, కండక్టర్‌కు రూ.1000 చొప్పున చెల్లించనుంది.
రిటైర్డ్ ట్రాఫిక్, మెకానికల్ సూపర్‌వైజర్స్, రిటైర్డ్ మెకానిక్స్, శ్రామిక్స్‌లతో పాటు ఎలక్ట్రిషన్స్, టైర్ మెకానిక్స్, క్లరికల్‌గా పని చేసే వారిని కూడా తీసుకోనుంది. ఇతర ప్రభుత్వ శాఖల్లో పని చేసిన డ్రైవర్స్, రిటైర్డ్ ఉద్యోగుల నుంచి కూడా దరఖాస్తులు తీసుకోనుంది. ఇప్పటికే తాత్కాలిక ప్రాతిపదికన కొంత మంది డ్రైవర్లు, కండక్టర్లను అధికారులు నియమించిన విషయం తెలిసిందే. మరోవైపు తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె తొమ్మిదో రోజు కూడా కొనసాగుతోంది.
“కాళేశ్వరం” నుంచి బొట్టు నీరు కూడా వినియోగంలోకి రాలేదు: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి