ఆంద్ర రాష్ట్ర ప్రజలు కోరుకున్న విధంగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. 126 నుంచి 130 సీట్లు కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, 22 నుంచి 23 ఎంపీ స్థానాల్లో వైసీపీ గెలవబోతోందని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా కాదు ఆంధ్ర ప్రజల నాడి చూసి తమ గెలుపు ఖాయమని చెబుతున్నానని చెప్పారు.
ఈ నెల 23న ఎన్నికల ఫలితాల కోసం ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఎన్నో అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్షనాయకుడు జగన్ అని అన్నారు. తన పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమై, వారి కష్టనష్టాల గురించి జగన్ తెలుసుకున్నారని అన్నారు. అందుకే వైసీపీ ని ప్రజలు గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.