ప్రియుడు తనను మోసం చేస్తున్నాడేమోనని అమెరికాకు చెందిన ఆ యువతికి అనుమానం వచ్చింది. దాన్ని తొలగించుకోవాలని గట్టిగా నిర్ణయించుకొని, ఉదయాన్నే అతన్ని ఓ పార్కులో కలిసింది. అతని ఫోన్‌లో వివరాలు చూడటానికి ప్రయత్నించింది. అయితే అతని ఫోన్ ఫేస్‌లాక్ చేసుంది. ఆ లాక్ తీయడానికి ప్రియుడు నిరాకరించడంతో ఆమె భద్రకాళిలా మారింది. బలవంతంగా ఆ లాక్ తీయడానికి ప్రయత్నించి, ఫోన్‌కు అతని మొహం చూపించబోయింది. కానీ ఆ ప్రియుడు తన మొహం ఫోన్ ముందుకు తీసుకురాకుండా తప్పించుకున్నాడు. దీంతో చిర్రెత్తిన ఆమె.. అతన్ని కిందపడేసి బలవంతంగా ఫోన్ లాక్ తీసింది. ఆ వెంటనే ఫోన్ తీసుకొని పారిపోయింది. అమెరికాలో జరిగిని ఈ ఘటనను ఆ పార్కులోనే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన క్షణాల్లోనే ఈ వీడియో వైరలయింది.
His girl was really committed to cracking his Face ID… pic.twitter.com/FSEwPzsamN
— Guy (@apiecebyguy) September 23, 2019