telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రేవంత్ రెడ్డి కి కొడంగల్ ఎమ్మెల్యే సవాల్… రాజీనామాకు సిద్ధం!

 తాను పోలీస్‌ శాఖలో బదిలీలు చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నానని టీపీసీపీ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డి నిరూపిస్తే.. తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. తనపై ఆరోపణలు నిరూపించకపోతే రేవంత్‌ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. పిచ్చోడి చేతికి పీసీసీ పదవి వచ్చిందని విమర్శించారు. అబద్దాలతో చెలామణీ అవుతున్న రేవంత్ రెడ్డి లాంటి వంద మంది రేవంత్ రెడ్డిలను ఎదుర్కొవాడానికి సిద్ధంగా ఉన్నాని చెప్పారు. డబ్బులు ఇచ్చి పదవి కొనుక్కున్నావని సొంత పార్టీ నేతలే చెప్పారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి పోరాటం చేయడానికి ఏం లేదన్నారు. సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణ యూత్ ఐ కాన్ కేటీఆర్‌పై అడ్డమైన ఆరోపణలు చేస్తే నాలుక కోస్తామని పట్నం నరేందర్‌ రెడ్డి హెచ్చరించారు. ఇప్పటి వరకు నీ సొంత నియోజకవర్గంలో సరైన విధంగా పర్యటన చెయ్యని నువ్వు సమస్యల గురించి రాష్ట్రం అంత తిరుగుతానంటే నమ్మటానికి ప్రజలు అమాయకలు కదన్నారు. 

Related posts