telugu navyamedia
సినిమా వార్తలు

ఇండియన్ ఫిల్మ్ కు ఆస్కార్ అవార్డు

Period-End-of-Sentence

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో 91వ ఆస్కార్ వేడుకలు వైభవంగా జరిగాయి. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డు మన భారతీయ డాక్యుమెంటరీ చిత్రానికి దక్కడం విశేషం. ప్రముఖ నిర్మాత గునీత్ మోంగా నిర్మించిన “పీరియడ్ : ఎండ్ ఆఫ్ సెంటెన్స్” అనే డాక్యుమెంటరీ చిత్రానికి ఆస్కార్ లభించింది. భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న రుతుక్రమ సమస్యల గురించి రూపొందించిన 25 నిమిషాల నిడివి గల ఈ డాక్యుమెంటరీని ఉత్తరప్రదేశ్ లోని హపూర్ ప్రాంతంలో తెరకెక్కించారు. ఈ ప్రాంతానికి చెందిన మహిళలు బయోడీగ్రేడబుల్ న్యాప్కిన్లు ఎలా తయారు చేయాలో నేర్చుకుని, వాటిని ఇతర మహిళలకు తక్కువ ధరకు అమ్ముతూ ఎలా సహాయపడ్డారనేదే ఈ సినిమా. ఈ చిత్రానికి రేకా జెహ్ తాబ్చి దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు ఎన్నో భారతీయ చిత్రాలు ఆస్కార్ కి నామినేట్ అయినప్పటికీ… అవార్డుల రాకపోవడంతో నిరాశ ఎదుర్కొన్నారు. ఎన్నోసార్లు భారతీయ చిత్రంతో దోబూచులాడింది ఆస్కార్ మొత్తానికి ఓ డాక్యుమెంటరీ సినిమాకు దక్కడం ప్రతిష్ఠాత్మకంగా మారింది.

Related posts