కేరళలోని మలప్పురం జిల్లాలో బాణసంచా కూర్చిన పైనాపిల్‌ను ఆహారంగా అందించి.. గర్భంతో ఉన్న ఏనుగును వధించిన ఘటనపై బుధవారం దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ ఘటనను కేరళ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఏనుగుకు ఆ పరిస్థితి రావడానికి బాధ్యులైన వారిని గుర్తించి.. కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే సీఎం పినరయ్ విజయన్ స్పష్టం చేశారు. ఆ దిశగా కేరళ అటవీ శాఖ విచారణ ముమ్మరం చేసింది. తాజాగా ఈ కేసులో ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. తాజాగా ఈ ఘటనపై ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ బీచ్ వద్ద సైకత శిల్పాన్ని రూపొందించారు. తల్లి ఏనుగు పక్కన గున్న ఏనుగు పడుకుని ఉన్నట్లు అందులో ఉంది. కేరళలో చనిపోయిన ఆడ ఏనుగు, దాని కడుపులోని పిల్లను ఈ సైకత శిల్పం వివరిస్తోంది. మానవత్వం మరోసారి విఫలమైందంటూ సుదర్శన్ పట్నాయక్ ఆ సైకత శిల్పానికి సంబంధించిన ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనతో మానవాళే సిగ్గుపడాల్సి వస్తోందని ఆయన చెప్పారు. పూరీ బీచ్‌లో తాను ఈ సైకత శిల్పాన్ని రూపొందించినట్లు ఆయన వివరించారు. ఈ సైకత శిల్పం కన్నీళ్లు పెట్టిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, తల్లి ఏనుగు, గున్న ఏనుగుకు సంబంధించిన పలు ఫొటోలు, కార్టూన్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Shame shame shame to humanity . Humanity has failed again………..
Save #Elephant. My SandArt at puri beach. pic.twitter.com/7J5A1OT1fh— Sudarsan Pattnaik (@sudarsansand) June 4, 2020