telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భారీ రేటుకు “అశ్వథ్థామ” థియేట్రికల్ రైట్స్

Ashwatthama

యంగ్ హీరో నాగశౌర్య ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ‘అశ్వథ్థామ’. రమణ తేజ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ నెల 31వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ బయటకు వచ్చి అందరినీ ఆకట్టుకుంది. తక్కువ సమయంలోనే మూడు మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తయిందట. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ద్వారా 10 కోట్ల రూపాయలు వచ్చాయట. అలాగే శాటిలైట్, డిజిటల్, ఆడియో రైట్స్ ద్వారా మరో 6.2 కోట్ల రూపాయలు వచ్చాయట. ఊహించిన దాని కంటే ఎక్కువ మొత్తం రావడంతో చిత్ర నిర్మాతలు చాలా సంతోషంగా ఉన్నారు. ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

Related posts