telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

బుమ్రా టెక్నిక్ .. ఫలించింది.. : ఇషాంత్

వెస్టిండీస్‌ టెస్ట్ సిరీస్ లో తొలి మ్యాచ్ కి వర్షం పడటంతో బౌలింగ్ టెక్నిక్ మారుస్తూ క్రాస్‌సీమ్‌ బంతులు వేయాలని సహచరుడు జస్ప్రీత్‌ బుమ్రా సూచించాడని టీమిండియా పొడగరి పేసర్‌ ఇషాంత్‌ శర్మ చెప్పాడు. ఆ సలహా పనిచేయడంతోనే ఆఖరి మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీయగలిగానని వెల్లడించాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 297 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ను ఇషాంత్‌ భారీ దెబ్బకొట్టాడు. 42 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. తొమ్మిదో సారి ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. బ్రాత్‌వైట్‌ (14), రోస్టన్‌ ఛేజ్‌ (48), షై హోప్‌ (24), షిమ్రన్‌ హెట్‌మైయిర్‌ (35), కీమర్‌ రోచ్‌ (0) అతడి బాధితుల జాబితాలో చేరారు.

వర్షం మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. అసలేం జరగకపోవడంతో బుమ్రా క్రాస్‌సీమ్‌ ప్రయత్నించమని సూచించాడు. అది పనిచేసింది. ప్రత్యర్థిని త్వరగా ఆలౌట్‌ చేస్తే జట్టుకు మంచిది. టీమిండియా ఇన్నింగ్స్‌ అప్పుడు నాకు అంత బాగాలేదు. జడ్డూతో కలిసి ఎక్కువ పరుగులు చేస్తే జట్టుకు మంచిది. 25/3 నుంచి అద్భుతంగా పుంజుకున్నాం. జడేజాతో కలిసి సుదీర్ఘ భాగస్వామ్యం నెలకొల్పాలని నేను భావించా’ అని ఇషాంత్‌ వెల్లడించాడు.

Related posts