టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ నటించిన చిత్రం ‘పాగల్’.. నివేదా పేతురాజ్ కథానాయికగా నటించింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ వేగం పెంచేసింది. పోస్టర్లు, ట్రైలర్, పాటలతో లవర్ బాయ్ ప్రేమ్ సినిమాపై ఆసక్తిని పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘ఆగవే నువ్వాగవే.. పోయే ఊపిరి నువ్వాపవే’ అని భావోద్వేగంతో కూడిన పాటను విడుదల చేశారు. ప్రేమలో ఓడిపోయిన వ్యక్తిగా విశ్వక్ హావభావాలు ఆకట్టుకునేలా ఉన్నాయి.
కాగా..అతని పేరు ప్రేమ్. సుమారు 1600 మంది అమ్మాయిలకి ‘ఐ లవ్ యు’ చెప్పాడు. కానీ, ఒక్క అమ్మాయిని మాత్రమే ప్రేమించాడు. ఆ అమ్మాయేమో ‘నీకూ నాకూ సెట్ అవదు’ అని ప్రేమ్‌ని వదిలివెళ్లిపోతుంది. గత జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంటూ విషాదంలో మునిగిపోతాడు ప్రేమ్.
ఈ ప్రేమ్ ఎవరో కాదు యువ నటుడు విశ్వక్ సేన్. తన ప్రేయసి.. నటి నివేదా పేతురాజ్. ఈ జంట కలిసి నటించిన చిత్రం ‘పాగల్’. సిమ్రన్ చౌదరి, మేఘాలేఖ, రాహుల్ రామకృష్ణ, మురళీశర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.