స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం `అల వైకుంఠపురములో..`. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదల కాబోతోంది. ఈరోజు (సోమవారం) సాయంత్రం హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ గ్రౌండ్స్‌లో `అల వైకుంఠపురములో..` మ్యూజిక్ ఫెస్టివల్ జరుగబోతోంది. ఈ కార్యక్రమంలో బన్నీ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడట. సూపర్‌డూపర్ హిట్ అయిన `రాములో.. రాముల..` పాటకు చిందులేయనున్నాడట. ఇప్పటికే విడుదలైన ఈ పాట వీడియోలో బన్నీ వేసిన హాఫ్‌కోట్ స్టెప్ సూపర్ పాపులర్ అయింది. ఆ స్టెప్‌ను లైవ్‌గా వీక్షించే అవకాశం సోమవారం సాయంత్రం రానున్నట్టు సమాచారం. అల్లు అర్జున్ డ్యాన్స్‌లకు తెలుగులోనే కాదు ఇతర భాషల చిత్ర పరిశ్రమల్లో కూడా అభిమానులున్నారు. ప్రతి సినిమాకు ఓ కొత్త రకం స్టైల్, స్టెప్‌లతో అభిమానులను బన్నీ అలరిస్తున్నాడు.
previous post