telugu navyamedia
సినిమా వార్తలు

గ్రాండ్‌ ఫినాలేలో షణ్ముఖప్రియ – విజయ్ దేవరకొండ బెస్ట్ విషెస్!

సుమధుర గానంతో దేశంలోని సంగీత ప్రియులు, అభిమానులను ఉర్రూతలూగిస్తున్న గాయని, సోనీ నిర్వ‌హిస్తున్న  ఇండియన్‌ ఐడల్‌ 12వ గ్రాండ్‌ ఫినాలేలో తలపడుతున్న షణ్ముఖప్రియ మన తెలుగు అమ్మాయే. శాస్త్రీయ సంగీతంతోపాటు.. వెస్ట్రన్, పాప్, రాక్ బ్లూస్ వంటి పాటలను తన సుమధుర గానంతో సంగీత ప్రియనులను అలరిస్తోంది. ఆగస్ట్ 15న మధ్యాహ్నం 12 నుంచీ రాత్రి 12 దాకా 12 గంటల పాటూ ఇండియన్ ఐడల్ ఫినాలే జరగనుంది.Vijay Devarakonda: ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్ షణ్ముక ప్రియకు బంపర్ ఆఫర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. ఆనందంతో గంతులేసిన సింగర్..అందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఈ సంగీత సమరాన్ని వీక్షిస్తారని అంచనా. అయితే, ఫైనల్ సిక్స్ కంటెస్టెంట్స్ లో మన తెలుగు అమ్మాయి షణ్ముఖ కూడా ఉంది. ఆమెని చీరప్ చేయటానికి స్వయంగా హీరో విజయ్ దేవరకొండ సర్ ప్రైజ్ చేశారు. ‘లైగర్’ స్టార్ స్పెషల్ వీడియో మెసేజ్ లో ఆమెకు బ్లెస్సింగ్స్ అందించటంతో పాటూ బెస్ట్ విషెస్ తెలియజేశాడు. షణ్ముఖ పర్ఫామెన్సెస్ తాను చూస్తుంటానని అన్నాఆయన ఆమె ఖచ్చితంగా టైటిల్ గెలుస్తుందని అభిప్రాయపడ్డాడు.

దీంతో ఫేవరేట్ హీరో విజ‌య‌దేవ‌ర కొండ మాట్లాడిన త‌రువాత‌ షణ్ముఖ ఆనందానికి కట్టలు తెంచుతూ షణ్ముక స్టేజ్ పైనే ఎగిరి గంతేసింది. ‘హైద్రాబాద్ తిరిగి రాగానే నా సినిమాలో నువ్వు పాట పాడుదువుగానీ’ అన్నాడు! దేవరకొండ ఆఫర్ తో షణ్ముఖ ప్రియ ఆనందానికి ఆవ‌దులు లేవు. అంతే కాదు షణ్ముఖ అమ్మ‌గారు అయిన రత్నమాల అయితే కేక‌లు పెడుతూ ఆనందంలో మునిగిపోయారు.  సొషల్ మీడియా మాధ్యమాల్లో విజయ్ దేవరకొండ ఇండియన్ ఐడల్ 12 వీడియో తెగ వైరల్ అవుతోంది. షణ్ముఖ ఫ్యాన్స్ జోరుగా షేర్ చేస్తున్నారు…

Related posts