telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్‌బాస్‌ ప్రొమో వచ్చేసింది

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్‌. తెలుగులో ఇప్పటికే 4 సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ షో తాజాగా 5వ సీజన్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూన్నారు. తాజాగా ఈ నిరీక్షణకు తెరదించుతూ బిగ్‌ బాస్‌ సీజన్‌ 5 ప్రొమోను విడుదల చేసింది స్టార్‌మా. నాగార్జున మాస్‌ ఎంట్రీతో తీర్చిదిద్దిన ఈ ప్రోమోను శనివారం విడుదల చేసింది. ఆద్యంతం అలరించేలా దీన్ని తీర్చిదిద్దింది. అంతేకాదు, ఈసారి హోస్ట్‌ ఎవరన్న దానిపై వస్తున్న వార్తలకు సమాధాన ఇస్తూ నాగ్‌ ఎంట్రీ అదిరింది. ‘చెప్పండి బోర్‌డమ్‌కు గుడ్‌బై.. వచ్చేస్తోంది బిగ్‌బాస్‌ సీజన్‌-5’ అంటూ నాగ్‌ చెప్పిన డైలాగ్‌ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. మిస్టర్‌ విసుగు, బిగ్‌బాస్‌ నడుమ జరిగిన ముఖాముఖిలో ఈ విసుగును నాగార్జున తన వినోదపు బుల్లెట్‌తో చంపడంతో ప్రతి ఒక్కరూ ఆనంద కేళిలో మునిగిపోతారు. ఈసారి బిగ్‌బాస్‌ షో యాక్షన్‌, డ్రామా, రొమాన్స్‌, వినోదం, ఆహ్లాదం సమ్మేళనంగా ఉండటమే కాదు గత సీజన్‌లతో పోలిస్తే మరింత పెద్దగా, ఉత్తమంగా ఉంటుందనే వాగ్ధానమూ చేస్తుంది.

బిగ్‌బాస్‌ సీజన్‌ 5 ప్రొమోకు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం చేయగా, ఫోటోగ్రఫీ డైరెక్టర్‌గా జె యువరాజ్‌ చేశారు. ఈ ప్రొమోకు సంగీతాన్ని యశ్వంత్‌ నాగ్‌ అందిస్తే, రాహుల్‌ సిప్లిగంజ్‌ పాటను ఆలపించారు. కొద్ది రోజుల క్రితమే బిగ్‌బాస్‌ లోగో విడుదలైంది. దారి తెలియని ఓ చిట్టడవి నుంచి బయటకు రావడానికి ఎలాగైతే యుక్తిని ప్రదర్శించాలో అదే రీతిలో బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి విజేతగా బయటకు రావడానికి చూపాల్సిన యుక్తిని గుర్తుకు తెచ్చే రీతిలో ఈ లోగో రూపుదిద్దుకుంది. మరి సీజన్‌-5లో ఎవరెవరు కంటెస్టెంట్‌లుగా ఉంటారు? ప్రేక్షకులను ఎలా అలరిస్తారు? బిగ్‌బాస్‌ ఇచ్చే కొత్త టాస్క్‌లు ఏంటి? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Related posts