telugu navyamedia
సినిమా వార్తలు

నెటిజన్ కు కౌంటర్ గా తాప్సి సవాల్

Taapsee who killed the user by tweet

ఇటీవలే “గేమ్ ఓవర్” చిత్రంతో సక్సెస్ అందుకున్న ఈ మిల్కీ బ్యూటీ తాప్సి మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాలీవుడ్ లో కూడా ఈ బ్యూటీ వరుస హిట్ సినిమాలతో దూసుకెళ్తోంది. తాజాగా దర్శకుడు అనుభవ్ సిన్హాతో సినిమా చేయబోతున్నానని, ఇలాంటి సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని, ఇప్పుడు ఆ కల నెరవేరబోతుందని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఆ దర్శకుడితో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో షేర్ చేసుకొంది. ఈ పోస్ట్ చూసిన ఓ నెటిజన్ “అభినవ్ సర్… మీరు సినిమాలో తాప్సికి బదులు మరో నటిని ఎన్నుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. తాప్సికి అసలు నటించడమే రాదు” అని వ్యాఖ్యానించాడు. ఇది చూసిన తాప్సి “సారీ యార్.. ఇప్పుడేం చేయలేవ్.. ఎందుకంటే సినిమాకు ఆల్రెడీ సైన్ చేసేశాను. ఇప్పుడు అనుభవ్ సర్ నన్ను తీసేయాలని నిర్ణయించుకున్నా.. అది నేను జరగనివ్వను.. ఒక పని చెయ్.. నేను మరో సినిమాకు సైన్ చేసేలోపు ఆ సినిమాలో నన్ను ఎవరూ తీసుకోకుండా ఆపి చూడు” అంటూ సవాల్ విసిరింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం వీరి ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related posts