telugu navyamedia
సినిమా వార్తలు

‘1997’ చిత్రంలోని నవీన్ చంద్ర లుక్ రిలీజ్ చేసిన పాగ‌ల్ హీరో..

vishwak sen launch to naveen chandra look form 1997

ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న బిన్నమైన కథా చిత్రం 1997. ఇందులో డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో న‌టించ‌నున్నారు. డా.మోహన్ స్వీయదర్శకత్వంలో ఈ చిత్రానికి సంబందించిన మూడు ముఖ్య పాత్రల్లో ఒకటైన నవీన్ చంద్ర లుక్ ని యంగ్ అండ్ క్రేజీ హీరో విశ్వక్ సేన్ విడుదల చేసారు.

ఈ నేపథ్యంలో 1997 లో జగపతి పాత్రలో నవీన్ చంద్ర లుక్ ని యంగ్ హీరో విశ్వక్ సేన్ విడుదల చేశారు. నేను పుట్టినతరువాత రెండేళ్లకు 1997 వచ్చింది. నవీన్ లుక్ బాగుంది .. తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం అందుకోవాల‌ని, అలాగే మోహన్ గారికి ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలి, ఈ సినిమా టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పారు పాగ‌ల్ హీరో విశ్వ‌క్‌.

ఈ సంద‌ర్భంగా హీరో, దర్శకులు డాక్టర్ మోహన్ మాట్లాడుతూ .. ఈ సినిమాలో ఉన్న మూడు ముఖ్యపాత్రల్లో నవీన్ చంద్ర పాత్రను రివీల్ చేసినందుకు మా హీరో విశ్వక్ సేన్ గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సందర్బంగా విశ్వక్ సేన్ నటిస్తున్న పాగల్ సినిమా పెద్ద విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఓ బర్నింగ్ ఇష్యుని తీసుకుని ఈ సినిమా చేశా.

ఈ సినిమా విషయంలో నాకు ప్రతి విషయంలో సపోర్ట్ అందించిన కోటి గారికి థాంక్స్ చెప్పాలి. అలాగే ఇందులో నటించిన నవీన్ చంద్రకు థాంక్స్ చెప్పాలి. కథ వినగానే వెంటనే చేస్తానని చెప్పారు. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుందని, అలాగే నా ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.

ఈశ్వర పార్వతి మూవీస్ బ్యాన‌ర్‌పై సినిమా తెర‌కెకిస్తుండగా..సంగీతం కోటీ గారు అందిస్తున్నారు. డాక్టర్ మోహన్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వ‌హిస్తుండ‌గా..నిర్మ‌త‌గా మీనాక్షి రమావత్ వ్య‌వ‌హారిస్తున్నారు. కెమెరామెన్ గా చిట్టి బాబు త‌దిత‌రులు..ఈ సినిమాలో న‌టిస్తున్నారు.

Related posts