telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వారందరినీ దేవుడు చల్లగా చూడాలి… మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్

Mahesh

లాక్‌డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా షూటింగ్‌లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. కరోనా నుంచి ప్రజలను కాపాడటమే ధ్యేయంగా దేశంలో ఎంతో మంది డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది పోరాడుతున్నారు. అలాంటి వారిని ఉద్దేశించి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ చేశారు. (ఏప్రిల్ 7) ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురష్కరించుకుని ఆయన ఈ పోస్ట్ పెట్టారు. ‘‘రెండు వారాల లాక్‌డౌన్.. మనం శక్తివంతమవుతున్నాం. ఈ విషయంలో మన ప్రభుత్వాలు ఐక్యంగా చేపట్టిన ప్రయత్నాలను కచ్చితంగా మెచ్చుకోవాలి. కోవిడ్-19పై మనం చేస్తోన్న యుద్ధంలో ముందు వరుసలో నిలబడిన వారందరికీ ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నాడు కృతజ్ఞతలు చెప్పుకుందాం. మన ఆరోగ్యం కోసం వారు పోరాడుతున్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో వీధులు, ఆసుపత్రుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతోన్న ఆ యోధులందరికీ వందనం. వారందరినీ దేవుడు చల్లగా చూడాలి. సామాజిక దూరం, పరిశుభ్రతను పాటించడంతో పాటు ధైర్యంగా ఉండడం కూడా చాలా ముఖ్యం. భయానికి దూరంగా ఉండాలి. భయాందోళనలను కలిగించే మనుషులు, వార్తలకు మనం దూరంగా ఉండాలి. తప్పుడు వార్తలు ఈ సమయంలో పెద్ద సమస్య. తప్పుదోవ పట్టించే వార్తలకు దూరంగా ఉండండి. ప్రతి ఒక్కరూ దీన్ని చదివి పాజిటివిటీ, ప్రేమ, ఆశ, సహానుభూతిని వ్యాప్తి చేయాలని కోరుతున్నాను. ఇలాంటి సమయంలో మనమందరం కలిసికట్టుగా ఉండాలి. ఇంట్లో ఉండండి.. భద్రంగా ఉండండి’’ అని మహేష్ బాబు తన పోస్ట్ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh) on

Related posts