telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

టర్కీ ఉల్లి ఇక ఇండియాకు రాదు..ధరలు తగ్గే అవకాశం లేనట్లే!

ap govt providing onions on subsidy

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా బహిరంగ మార్కెట్లో ఉల్లి ధర కిలో రూ.120 నుంచి రూ.150 వరరకు పలుకుతోంది. ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఎగుమతులపై నెలరోజుల క్రితమే నిషేధం విధించింది. ఉల్లి సంక్షోభం నేపథ్యంలో ఈజిప్టు, టర్కీ నుంచి భారత్‌ ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7,070 టన్నుల ఉల్లి భారత్‌కు వచ్చింది. అందులో టర్కీ నుంచి 50శాతానికి పైగా కొనుగోలు చేసినట్లు వ్యాపారులు వర్గాలు చెబుతున్నాయి.

టర్కీ దేశం నుంచి భారత్‌కు ఎగుమతి చేసేందుకు పోటీ నెలకొనడంతో అక్కడి మార్కెట్లో ఉల్లి ధరలు పెరగడం మొదలైంది. దీంతో ఉల్లిపాయల ఎగుమతిపై టర్కీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ రెండు దేశాల నుంచి ఉల్లి రావడంతోనే ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. మళ్లీ కొరత ఏర్పడితే ఉల్లి ధరల పెంపు సామాన్య ప్రజల మీద భారం పడుతుందని వ్యాపారులు అంటున్నారు.

Related posts