telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా…

students masks exams

కరోనా కలలుగా గత ఏడాది చాలా పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. కానీ ఈ మధ్యే మళ్ళీ అన్ని విద్యాసంస్థలను ప్రారంభించడంతో పరీక్షలను నిర్వహించడం ప్రారంభించారు. కానీ ఇప్పుడు మళ్ళీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇక్కడ విద్యాసంస్థ‌లు ఇప్ప‌టికే తాత్కాలికంగా మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా ఇప్పుడు డిగ్రీ, పీజీ ప‌రీక్ష‌లు కూడా వాయిదా వేస్తున్న‌ట్లు ఉన్న‌త విద్యామండ‌లి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. క‌రోనా నేపథ్యంలో విద్యార్థుల‌కు ఇబ్బంది కాకుండా ఉండేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ప‌రీక్ష‌ల కొత్త షెడ్యూల్ ను త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తామ‌ని ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ప్రొ పాపిరెడ్డి ప్ర‌క‌టించారు కరోనా నేపథ్యంలో నేటి నుంచి అన్ని విద్యా సంస్థలను మూసి వేస్తున్నట్లుగా నిన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు కాబట్టి స్కూల్స్ మూసి వేయాలని కోరుతున్నారని అందుకే రాష్ట్రంలో కరోనా వ్యాధి అరికట్టడం కోసం రేపటి నుంచి స్కూల్స్ మూసివేస్తున్నామని ప్రకటించారు.

Related posts