telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

అఖిలప్రియ బెయిల్ పిటీషన్ పై కొనసాగుతున్న సందిగ్దత…

రెండు తెలుగు రాష్ట్రలో కలకలం రేపిన బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అరెస్ట్‌ అయిన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌పై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే అఖిలప్రియకు బెయిల్‌ను నిరాకరించిన సికింద్రాబాద్ కోర్టు.. పోలీస్‌ కస్టడీకి కూడా అనుమతి ఇచ్చింది. ఇక, ఆమె బెయిల్‌ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.. సెషన్స్‌ కోర్టు ఆదేశాలతో అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ కౌంటర్ దాఖలు చేశారు బోయిన్‌పల్లి పోలీసులు… దీంతో.. అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది కోర్టు.. ఇదే కేసులో నిందితులుగా ఉన్న అఖిలప్రియ భర్త భర్గవరామ్‌, ఆమె సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేయగా.. వాటిపై కూడా కౌంటర్‌ దాఖలు చేశారు పోలీసులు.. ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై విచారణ కూడా రేపటికి వాయిదా పడింది.. దీంతో.. అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌తో పాటు.. రెండు ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై శుక్రవారం విచారణ జరగనుంది. ఇక, అఖిలప్రియకు బెయిల్‌ వస్తుందా? అనేది సందిగ్ధంగా మారింది.. గతంలో ఆమెకు బెయిల్‌ ఇవ్వొద్దని పోలీసులు కౌంటర్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts