telugu navyamedia
రాజకీయ

తొలిరోజు ముగిసిన సోనియా గాంధీ ఈడీ విచారణ..

నేషనల్‌ హెరాల్డ్‌ వ్యవహారానికి సంబంధించి మనీలాండరింగ్‌ కేసులోకాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ముందు గురువారం హాజరయ్యారు.

దాదాపు మూడు గంటలపాటు సోనియాపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఆరోగ్య కారణాలతో ఆమె చేసిన ప్రత్యేక విజ్ఞప్తితో తొలిరోజు విచారణను త్వరగానే ముగించారు. మళ్లీ 25న (సోమవారం) విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు. ఐదుగురు అధికారుల‌తో కూడిన ఈడీ బృందం సోనియా గాంధీని విచారించింది

మధ్యాహ్నం తన ఇంటి నుంచి బయల్దేరిన సోనియా వెంట ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు. సోనియాగాందీ ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆమెకు సహాయకారిగా ఉండేందుకు ప్రియాంకకు ఈడీ అనుమతిచ్చింది. విచారణ సమయంలో రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ ఈడీ కార్యాలయంలో వేరే గ‌దిలో వేచి చూశారు.

National Herald case: Sonia Gandhi arrives at ED office for questioning;  party MPs court mass arrest- The New Indian Express

కాంగ్రెస్ పత్రిక నేషనల్ హెరాల్డ్‌ యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికే ఈడీ అధికారులు రాహుల్ గాంధీని పలుమార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే.

కాగా.. నేషనల్​ హెరాల్డ్​ కేసులో సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించడంపై కాంగ్రెస్​ తీవ్రంగా మండిపడుతోంది. రాజకీయ ప్రతీకారంలో భాగంగానే కేంద్రం.. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​ కార్యకర్తలు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు.పలు చోట్ల నిరసనలు ఉద్ధృతంగా మారాయి.

75 Congress MPs including Mallikarjun Kharge, Shashi Tharoor detained as ED quizzes Sonia Gandhi

ఢిల్లీలో నిరసనలు చేపట్టిన సుమారు 75 మంది కాంగ్రెస్ ఎంపీల‌నును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొన్న కాంగ్రెస్​ కార్యకర్తలను నిలువరించేందుకు పోలీసులు వాటర్‌ కెనాన్‌లు ప్రయోగించారు.

75 Congress MPs including Mallikarjun Kharge, Shashi Tharoor detained as ED quizzes Sonia Gandhi

మరోవైపు కాంగ్రెస్​పార్టీ ప్రధాన కార్యాలయం ముందు నిరసన చేస్తున్న పలువురు ఎంపీలను నిర్బంధించినట్లు పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్​పేర్కొన్నారు.

Related posts