రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ‘లైగర్. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్, ప్రముఖ నటి రమ్యకృష్ణ నటించారు. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు లైగర్ ట్రైలర్‌తో ట్రీట్ ఇచ్చారు మూవీ టీం.
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌లో లైగర్ ట్రైలర్ ఫస్ట్ ప్రీమియర్ విడుదల చేశారు.. హాల్ అంతా అభిమానుల ఈలలు, చప్పట్లు, కేకలతో దద్దరిల్లింది.
హీరో విజయ్ దేవరకొండ,హీరోయిన్ అనన్యా పాండే, డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ప్రొడ్యూసర్స్ కరణ్ జోహార్, చార్మీ కౌర్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులకు కిక్ ఇచ్చే రేంజ్ లో విజయ్ దేవరకొండ మాట్లాడారు.
‘ట్రైలర్ కి ఈ రచ్చ ఏందిరా నాయనా! ఏందిరా ఈ మెంటల్ మాస్” అంటూ తన ముందు ఉన్న అభిమానులను ఉద్దేశించి విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించారు.
నాకు ఈ రోజు ఏమీ అర్థం కావడం లేదు. మీకు మా అయ్య తెల్వదు, మా తాత తెల్వదు, ఎవ్వడూ తెల్వదు. నా సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అయితుంది. రిలీజ్ అయిన సినిమా కూడా పెద్దగా చెప్పుకునే సినిమా కాదు.
అయినా ట్రైలర్‌కి ఈ రచ్చ ఏందిరా నాయనా? ఏందిరా ఈ మెంటల్ మాస్! మీ ప్రేమకు ఐ లవ్ యూ. ఈ సినిమా కోసం బాడీ, ఫైట్స్, డ్యాన్స్ చేసినా..తనకు డ్యాన్స్ అంటే నాకు చిరాకు.. మా వాళ్ళు (అభిమానులు) గర్వంగా ఫీల్ కావాలని చేశా . ఈ సినిమాను మీకు డెడికేట్ చేస్తున్నా. ఆగస్టు 25న ‘లైగర్’ విడుదలయ్యే ప్రతి థియేటర్ నిండిపోవాలని, ఆ రోజు ఇండియా షేక్ అయితదని విజయ్ దేవరకొండ తెలిపారు.