telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“అల వైకుంఠపురంలో” మలయాళ పోస్టర్

Ay

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమాగా రూపుదిద్దుకుంటున్న చిత్రం “అల వైకుంఠపురములో”. 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ చిత్రాన్ని హారిక మరియు హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లలో ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్, సీనియర్ నటి టబు, నవదీప్, మురళి శర్మ, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అల్లు అరవింద్‌, ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుందని సమాచారం. ఇప్ప‌టికే సినిమాలోని రెండు పాట‌లు విడులైన సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. తమన్‌ స్వరకర్త. కాగా అల్లు అర్జున్‌కి తెలుగులోనే కాదు మ‌ల‌యాళంలోను మంచి క్రేజ్ ఉంది. ఆయ‌న న‌టించిన సినిమాల‌న్నీ దాదాపు కేర‌ళ‌లో విడుద‌లై మంచి హిట్ కొట్టాయి. తాజాగా బ‌న్నీ న‌టిస్తున్న”అల‌.. వైకుంఠ‌పుర‌ము”లో చిత్రాన్ని మ‌ల‌యాళంలో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. కొద్ది సేప‌టి క్రితం మ‌ల‌యాళ వ‌ర్షెన్‌కి సంబంధించిన పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో బ‌న్నీ ప‌రిగెత్తుతున్న‌ట్టుగా స్టిల్ ఉంది. “అంగు వైకుంఠ‌పుర‌త్తు” అనే టైటిల్‌తో మ‌ల‌యాళ వ‌ర్షెన్ విడుద‌ల కానుండ‌గా, చిత్రం నుండి సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నా అనే మ‌ల‌యాళ వర్షెన్ పాటని న‌వంబ‌ర్ 10న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ పాట‌తో మ‌ల‌యాళంలోను సినిమాపై హైప్ క్రియేట్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు.

Related posts