telugu navyamedia
తెలంగాణ వార్తలు

కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌ది చీక‌టి ఒప్పందం..-కేసీఆర్‌కు ఈడీ విచారణ తప్పదు

*కేసీఆర్‌పైనా ఈడీ, సీబీఐ కేసులు పెడ‌తారు..
*క‌చ్చితంగా కేసీఆర్ ఈడీ, సీబీఐ విచారణకు హాజ‌రు కావాల్సి వ‌స్తాది.
*కాంగ్రెస్‌, టీఆర్ ఎస్‌ది చీక‌టి ఒప్పందం..

తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కోక తప్పదని అన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచ‌ల‌న‌వ్యాఖ్య‌లు చేశాడు.

సిద్దిపేట అర్బన్ మండలంలో ప్రజా గోస – బీజేపీ భరోసా యాత్ర పేరుతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ..భవిష్యత్‌లో ఇద్దరం కలిసి కొట్టాడదామని టీఆర్ఎస్‌కు సంకేతాలు ఇచ్చేందుకే.. తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేస్తోందని విమర్శలు గుప్పించారు.

”ఏవైనా ఆరోపణలు వస్తే.. న్యాయపరంగా కొట్లాడాలి. వాటిని ఎదుర్కొని నీతి నిజాయితో బయటకు రావాలని సోనియాపై విమ‌ర్శ‌లు గుప్పించారు. కేసీఆర్.. నీ మీద కూడా కేసులు పెట్ట‌డం గ్యారంటీ. ఈడీ, సీబీఐ విచారణకు వెళ్లాల్సి ఉంటుంద‌ని అన్నారు.

కాంగ్రెస్, టీఆర్ఎస్‌ది చీకటి బంధం.. సోనియా కోసం ఇప్పుడు మేం ఎలా కొట్లాడుతున్నామో చూడు. .నెక్ట్స్ మీరు కొట్లాడాలి.. ఇద్దరం కలిసి పోరాటం చేద్దామన్న సంకేతాలు ఇవ్వడం కోసమో.. కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేస్తోంది. ” అని బండి సంజయ్ పేర్కొన్నారు

రాష్ట్రంలో ధాన్యం వర్షంలో తడిసి మొలకెత్తడానికి, నష్టం జరగడానికి పూర్తి భాద్యత రాష్ట్రానిది, ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అన్నారు.
రాష్ట్రంలో పండిన పంటను కాపాడలేని సీఎం.. రాష్ట్ర ప్రజలను ఎం కాపాడతారని ప్రశ్నించారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి భరోసా కల్పించడమే తమ ప్రజా సంగ్రామ యాత్రని బండి సంజయ్ అన్నారు.

రూ. 800 కోట్లతోప్ర‌గ‌తిభ‌వ‌న్‌ ను కట్టుకుని జల్సాలు చేస్తున్నావని కేసీఆర్ ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.కేసీఆర్ కేబినెట్ లో తెలంగాణ ద్రోహులే ఉన్నారన్నారు. తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ రోడ్డున పడేశారని బండి సంజయ్ విమర్శించారు.

Related posts