telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీరియస్..

Kishan Reddy

జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. తన పర్యటన సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు ఎవరు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి లోతట్టు ప్రాంతాల సందర్శన సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు దూరంగా ఉన్నారు. దీంతో ఆగ్రహానికి లోనైనా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి…జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ కు పోన్ చేశారు. కనీసం డీఈ, ఏఈ స్థాయి అధికారులను పంపించకపోవడం సమంజసం కాదన్న కిషన్ రెడ్డి…లోకేష్ కుమార్ పై ఫైర్ అయ్యారు. సంబంధిత అధికారులు ఒక్కరు రాకపోతే తాను వివరాలు ఎలా తెలుసుకుంటానని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మళ్ళీఢిల్లీ వెళ్లిపోవాలని..తన పర్యటనకు తహశీల్ధార్ లు కూడా వచ్చే స్థాయి కూడా కాదా అని నిలదీశారు.  ఇక అనంతరం హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతితో కిషన్ రెడ్డి మాట్లాడారు. నీళ్ళల్లో ఉన్న నివాసితులకు నిత్యావసరాలు, పాలు, ఆహరం పంపిణి చేయాలనీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదేశించారు.

Related posts