భోపాల్ లోక్‌సభ స్థానానికి పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్‌సింగ్ విజయాన్ని కాంక్షిస్తూ వందలాది మంది సాధువులు మంగళవారం భోపాల్ చేరుకున్నారు. బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నారు. కంప్యూటర్ బాబాగా పేరుపొందిన సాధూ నామ్‌దేవ్ త్యాగి ఆధ్వర్యంలో దిగ్విజయ్ సింగ్ విజయం కోసం ప్రముఖ హిందూ సాధువు కంప్యూటర్ బాబా భారీ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. హటయోగా కార్యక్రమాన్ని కంప్యూటర్ బాబా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎన్నికల సంఘం బాబా యజ్ఞంపై దర్యాప్తు ప్రారంభించింది.
లోక్‌సభ ఎన్నికల్లో దిగ్విజయ్ గెలవాలని ఓ మైదానంలో కంప్యూటర్ బాబా యజ్ఞం ప్రారంభించాడు. జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా ఎన్నికల అధికారి సుదామా ఖడేలు ఈ దర్యాప్తు నిర్వహిస్తున్నారు. బీజేపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ కొనసాగుతున్నది. కంప్యూటర్ బాబాకు అప్పటి బీజేపీ ప్రభుత్వం నర్మదా పరిశుభ్రత ప్యానెల్‌లో సహాయ మంత్రి హోదా కట్టబెట్టింది. ప్రస్తుతం ఆయన బీజేపీ ప్రభుత్వపనితీరుపై అసంతృప్తిగా ఉన్నారు.