telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ జరగాల్సిందే: లోకేశ్

Nara Lokesh

అంతర్వేది ఆలయ ప్రాంగణంలో రథం దగ్ధం ఘటనపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మరోసారి స్పందించారు. ఈ మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ జరగాల్సిందేనని అన్నారు. రాబోయే రోజుల్లో తాము దీనిపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు.ప్రజల మధ్య మత సామరస్యం కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు.  

రాష్ట్రంలో రథం దగ్ధం కావడం ఇది రెండో ఘటన అని తెలిపారు. వీళ్లకు ప్రతిదానికి చంద్రబాబే గుర్తుకు వస్తున్నారని, వారికి కలలో కూడా చంద్రబాబే గుర్తొస్తున్నారని విమర్శించారు. రాజధానిని కూడా అమరావతి నుంచి తరలిస్తామని ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలపై లోకేశ్ స్పందించారు. ఆ మంత్రికి ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు వెళ్లిందని అన్నారు. దాంతో ఏం మాట్లాడుతున్నాడో అతనికే అర్థం కావడంలేదని ఎద్దేవా చేశారు. అతనొక్కడికే కాదని అందరు వైసీపీ మంత్రులకు ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరినట్టుందని లోకేశ్ ఆరోపించారు.

Related posts