ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయాల్సిన ఒక మంత్రితో ప్రతిపక్ష నాయకుడిని బూతులు తిట్టించి ఆనందపడిన రోజున జగన్ గారికి మర్యాద గుర్తుకు రాలేదా? అని ప్రశించారు. రాజారెడ్డి రాజ్యాంగంలో బూతులు తిట్టిన వైసీపీ నేతలపై చర్యలు ఉండవని రాసుకున్నారా? అని ట్వీట్ చేశారు.
తాము కూడా తిట్టగలమని, కానీ అది తమ పార్టీ సంస్కృతి కాదని చెప్పినందుకు టీఎన్ఎస్ఎఫ్ మాజీ అధ్యక్షుడు బ్రహ్మంపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తారా? అని లోకేశ్ మండిపడ్డారు. బ్రహ్మంకి అండగా టీడీపీ ఉంటుందని చెప్పారు. తమ కార్యకర్త విమర్శకి సమాధానం చెప్పే దమ్ము లేక, కేసులు పెట్టే జగన్ నాయకుడో? లేక దద్దమ్మో? వైసీపీ శ్రేణులే తేల్చుకోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.