కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ సినీనటి విజయశాంతి గాంధీభవన్ లో కొందరు తనపై కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని ఆమె వీడుతున్నారన్న వార్తలను ఖండించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ, తాను పార్టీ మారుతున్నానన్న ప్రచారం కూడా గాంధీ భవన్ లోనే ప్రారంభమైందని అన్నారు.
పార్టీ విడిచి వెళ్లాలనుకుంటే బహిరంగంగానే ప్రకటిస్తానని, హడావుడి నిర్ణయాలు తీసుకోనని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్ కు కూడా స్పష్టం చేశానని పేర్కొన్నారు.
కోర్టు చీవాట్లు పెడుతున్నా ఒంటెద్దు పోకడలు: జగ్గారెడ్డి