telugu navyamedia
క్రీడలు వార్తలు

మనీష్ పాండే పై నెహ్రా ఆగ్రహం…

నిర్లక్ష్యపు బ్యాటింగ్‌తో బెంగళూరు పై గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ ఓటమికి మనీష్ పాండే కారణమని, అతని స్ట్రైక్‌రేట్ చాలా దారుణంగా ఉందని మాజీ క్రికెటర్లు విమర్శించారు. ఈ క్రమంలో నెహ్రా మాట్లాడుతూ.. పాండే‌కు ఒత్తిడిని అధిగమించే సామర్థ్యం లేదన్నాడు. ‘ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సరైన సమయంలో వారి ఏకైక లెగ్ స్పిన్ అస్త్రాన్ని ఉపయోగించాడు. షబాజ్ అహ్మద్‌కు బంతినిచ్చి ఫలితాన్ని రాబట్టాడు. అయితే ఈ ఓవర్‌లో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్ స్టో, మనీష్ పాండే, అబ్దుల్ సమాద్ ఔటైన విధానం దారుణం. వారి ఆట స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌లా లేదు. చివర్లో బ్యాటింగ్ వచ్చే టెయిలండర్స్‌లా ఈ ముగ్గురి షాట్ సెలెక్షన్ ఉంది. ముఖ్యంగా మనీష్ పాండే ఔటైన తీరు విస్మయపరిచింది. ఈ తరహా ఆట తీరుతోనే మనీష్ పాండే టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. అతని సహచర ఆటగాళ్లయిన హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ తనను మించిపోయారు. ఎందుకంటే వీరు మనీష్ పాండే కన్నా గొప్పగా కఠిన పరిస్థితులను బాగా అందిపుచ్చుకుంటారు. జట్టుకు విజయాలనందిస్తారు.’అని ఆశిష్ నెహ్రా చెప్పుకొచ్చాడు.

Related posts