telugu navyamedia
రాజకీయ

మనీలాండరింగ్‌ కేసు : సంజయ్‌ రౌత్‌కు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ

మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ను 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది ముంబైలోని ప్రత్యేక కోర్టు . ముంబైలోని పత్రచల్‌ ప్రాంత పునర్నిర్మాణ పనుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రౌత్‌. ఈడీ కస్టడీ గడువు సోమవారంతో ముగుస్తుండటంతో ఆయనను అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ మేరకు తీర్పు వెలువరించింది ప్ర‌త్యేక‌ న్యాయస్థానం.

దీంతో ఆయన జైలులో గడపనున్నారు. తనకు ఇంటి నుంచే ఆహారం, ఔషధాలు తీసుకురావాలని సంజయ్‌ రౌత్‌ కోరగా.. అందుకు అంగీకరించింది కోర్టు. కానీ, ప్రత్యేక పడక ఏర్పాటును తిరస్కరించింది.

ముంబైలోని పట్రా చావల్ రీవలప్‌మెంట్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయనే అభియోగంపై సంజయ్‌ రౌత్‌ను ఆగస్టు 1న ఈడీ అరెస్టు చేసింది. తొలుత ఈనెల 4 వరకూ ఈడీ కస్టడీకి ఆదేశించిన కోర్టు, ఆ తర్వాత ఈడీ విజ్ఞప్తి మేరకు 8వ తేదీ వరకూ పొడిగించింది. ఈ కేసులో అలీబాగ్‌లో ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న ఈడీ, సంజయ్ రౌత్ భార్య హర్షా రౌత్ బ్యాంకు అకౌంట్‌లో రూ .1.08 కోట్లు ఉన్నట్టు గుర్తించింది.

ఇందుకు సంబంధించి వర్షా రౌత్‌ను శనివారంనాడు తొమ్మిది గంటల సేపు ప్రశ్నించింది. శివసేన చీఫ్, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు అత్యంత సన్నిహితుడైన రౌత్ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని, ఈడీ తప్పుడు కేసు బనాయించిందని అంటున్నారు

Related posts