ఎంఎస్ ధోనీ ఫ్యామిలీతో కల్సి సరదాగా గడిపిన ఓ కార్యక్రమంలో స్నేహితులతో కలిసి ఆడిపాడారు. దాంతో తనలో ఉన్న మరో ట్యాలెంట్ ను బయటకు తీశారు. ప్రపంచ కప్ 2019 సెమీస్ అనంతరం ధోనీ తాత్కాలిక విరామం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సమయాన్ని ధోనీ తన ఫ్యామిలీ సభ్యులతో గడిపేందుకు వినియోగిస్తున్నారు. ప్రధానంగా తన కూతురు జీవాతో కలసి ఆయన సందడి చేస్తున్నారు. ఈ సందర్భంలో ఆయన కుటుంబంతో కలిసి ఓ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ తన స్నేహితుడితో కలిసి జుర్మ్ అనే బాలీవుడ్ సినిమాలోని జబ్ కోయ్ బాత్ బిగాద్ జయా అనే పాటను మహీ పాడి అందర్ని ఆశ్చర్యపరిచారు.
ధోనీ స్నేహితురాలు, టెలివిజన్ నటి ప్రీత్ సిమోస్ ఈ వీడియోను తప్పనిసరి పరిస్థితుల్లో పోస్ట్ చేస్తున్నా నన్ను చంపకు అంటూ తన ఇన్‍స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. వీడియో పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.