telugu navyamedia
రాజకీయ వార్తలు

మమత మెగా ర్యాలీ.. వ్యతిరేకించిన గవర్నర్

BJP compliant EC West Bengal

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ రోజు కోల్‌కతాలో మెగా ర్యాలీ తీశారు. కానీ ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ ఆ ర్యాలీని వ్య‌తిరేకించారు. సీఎం మ‌మ‌తా తీసిన ర్యాలీపై ఆయ‌న తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. ర్యాలీ రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌న్నారు. ఇది స‌మ‌స్య‌ను మ‌రింత జ‌ఠిలం చేసే ప్ర‌క్రియ అన్నారు.

విధ్వంస‌క‌ర ప‌రిస్థితుల్లో ఇలాంటి ర్యాలీలు తీయ‌డం చ‌ట్ట‌వ్య‌తిరేక‌మ‌న్నారు. కానీ మ‌మ‌తా మాత్రం ఇవాళ మ‌ధ్యాహ్నం భారీ ర్యాలీ తీశారు. భారీగా ప్ర‌జ‌లు ఆ ర్యాలీలో పాల్గోవాలంటూ ఆమె ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. రెడ్ రోడ్డులోని బాబాసాహెబ్ అంబేద్క‌ర్ విగ్ర‌హం నుంచి ర్యాలీ ప్రారంభమై జొర‌సాంకే త‌కుర్‌బ‌రి వ‌ద్ద ముగియనుంది.

Related posts