telugu navyamedia
క్రీడలు వార్తలు

బీసీసీఐ టీ20 కెప్టెన్సీ రోహిత్ కు ఇవ్వాలి : ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

ఐపీఎల్ 2020లో నాకౌట్‌ మ్యాచ్‌లు ఆడటంలో ఆరితేరిన ముంబై ఇండియన్స్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. ఇక ఐపీఎల్‌లో తిరుగులేని కెప్టెన్‌గా మారిన రోహిత్ శర్మపై ప్రశంసల జల్లు కురుస్తోంది. హిట్‌మ్యాన్ నాయకత్వ లక్షణాలు, ముంబై ఇండియన్స్ ఆధిపత్య ప్రదర్శనపై ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫాన్స్ మాత్రమే కాదు మాజీ సారథులు కూడా రోహిత్ కెప్టెన్సీకి ఇంప్రెస్ అవుతున్నారు. రోహిత్ సారథ్యంకు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ ఫిదా అయ్యాడు. టీ20ల్లో భారత జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ‌ను ఎంపిక చేయాలని సూచించాడు. టీ20 ఫార్మాట్లో ఎలా గెలవాలో రోహిత్‌కు బాగా తెలుసని పేర్కొన్నాడు. అంతేకాదు ముంబై ఫ్రాంచైజీ టీ20 ప్రపంచకప్‌ ఆడితే.. అక్కడ కూడా టైటిల్ కూడా గెలుస్తుందని వాన్ జోస్యం చెప్పాడు.

ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్ 2020 విజేతగా నిలిచిన అనంతరం ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ రెండు ట్వీట్లు చేశాడు. ‘ఇక ప్రశ్నలు అనవసరం.. రోహిత్ శర్మ‌ను టీమిండియా టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేయాలి. ఆటగాళ్లను ఎలా వాడుకోవాలో అతడికి బాగా తెలుసు. అద్భుత మ్యాన్ మేనేజర్.. లీడర్ కూడా. టీ20 గేమ్‌లను ఎలా గెలవాలో రోహిత్‌కు బాగా తెలుసు. అతడిని టీ20 కెప్టెన్ చేయడం వల్ల విరాట్ కోహ్లీకి కూడా భారం తగ్గే అవకాశం ఉంది. మిగతా జట్లు ఇద్దరు కెప్టెన్లు విధానాన్ని అనుసరించి ఫలితం రాబడుతున్నాయి’ అని ట్వీట్ చేశాడు. మాజీ క్రికెటర్లు కూడా ఎప్పటినుంచో రోహిత్ శర్మను కెప్టెన్ చేయాలని అంటున్నారు. మిగతా జట్ల మాదిరి సంప్రదాయ, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లలో వేర్వేరు సారథులు ఉండాలఅంటున్నారు. ఇప్పుడు ముంబై ఐదోసారి కప్ కొట్టడంతో.. ఫ్యాన్స్ సైతం పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్‌ను కెప్టెన్ చేయాలనే డిమాండ్‌ను తెరమీదకు తీసుకొచ్చారు. వన్డేలు, టీ20ల్లో విరాట్ కోహ్లీ బదులు రోహిత్‌కు కెప్టెన్సీ అప్పగిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

Related posts